

ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు ఆస్కార్. వెండితెర నటీనటుల చిరకాల స్వప్నంగా నిలిచిన ఈ అవార్డుకు అసలు పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. అకాడమీ లైబ్రేరియన్ మార్గరెట్ హెరిక్ ఈ విగ్రహాన్ని చూసి అది తన బాబాయ్ ఆస్కార్‌లా ఉందని సరదాగా చెప్పడంతో ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. మెరిసే బంగారు విగ్రహంలా కనిపించే ఈ ట్రోఫీ సుమారు 3.8 కిలోల బరువు, 13.5 అంగుళాల పొడవు కలిగి ఉంటుంది.
ఆస్కార్ ట్రోఫీని అమ్మడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. 1951 నిబంధన ప్రకారం విజేతలు లేదా వారి వారసులు ఆ అవార్డును వదులుకోవాలనుకుంటే ముందుగా అకాడమీకే తిరిగి ఇవ్వాలి, దానికి ప్రతిగా అకాడమీ కేవలం ఒక్క డాలర్ మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ అట్టహాసమైన కార్యక్రమం నిర్వహణకు సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. 2002 నుంచి లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు శాశ్వత వేదికగా మారి అనేక చారిత్రక క్షణాలకు సాక్ష్యంగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!