

విదేశీ శక్తుల ఆర్థిక సహకారంతో, కాక్రోచ్ పార్టీ, నేహా బోరా వంటి శక్తులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కుట్రలకు పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ నెల 5న కరీంనగర్‌లో నిర్వహించనున్న మహార్యాలీకి సంబంధించి ఆదివారం కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్నాయని తాము ఆరోపిస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే 40 ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ైదరాబాద్‌లో నిర్వహించనున్న పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటారని, కరీంనగర్ మహార్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరవుతారని బండి సంజయ్ వెల్లడించారు. అమిత్‌షా పాదయాత్రకు సంబంధించి సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్, హైదరాబాద్ పరిధిలోని ఎంపీలు జనసమీకరణ బాధ్యతలు చేపట్టినట్లు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!