

దర్శకుడు రమణ్ నిమ్మల తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘ఒసేయ్ బాలమ్మ’ 2026 లో అమెరికాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. విజయవాడ గుణదలలో జరిగిన మీడియా సమావేశంలో రమణ్ నిమ్మల మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 11 వేల ఎంట్రీలలో కేవలం 50 చిత్రాలే షార్ట్‌లిస్ట్ కాగా, అందులో తమ చిత్రం ఉండటం గర్వకారణమన్నారు.
ఈ చిత్రం సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీ విభాగానికి ఎంపికైన తొలి తెలుగు లఘుచిత్రంగా రికార్డు సృష్టించిందని తెలిపారు. తన చిన్ననాటి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో గడిపిన అనుభవాలే ఈ కథకు ప్రేరణగా మారాయని చెప్పారు. తెలంగాణలోని నేరడిగుంట గ్రామంలో ఈ షార్ట్ ఫిల్మ్‌ను షూట్ చేసినట్లు వెల్లడించారు. న్యూయార్క్‌లో మంచి ఉద్యోగాన్ని వదులుకొని, వ్యక్తిగత అనుభవాల ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే కథలు చెప్పాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి వచ్చానని రమణ్ నిమ్మల తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!