
జనరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు ప్రముఖ తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.
ఈ సమావేశంలో నిర్మాతలు వై. రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, చిత్ర నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించే దిశగా ప్రభుత్వం మరియు సినీ రంగం కలిసి పనిచేసే అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!