
రాజకీయాలు

కోలీవుడ్ నటి తేజు అశ్విని యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ‘ఎన్నా సొల్ల పొగిరై’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే ‘నవాబ్ కేఫ్’ సినిమాతో తెలుగులోనూ అడుగుపెట్టారు. ప్రస్తుతం తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘మూండ్రమ్ కన్’తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజు అశ్విని తన కెరీర్ ప్రారంభంలో కొన్ని పెద్ద సినిమాలు మిస్ అయిన విషయాన్ని వెల్లడించారు. ‘డిమోంటే కాలనీ 2’, ‘లవర్’ వంటి సినిమాలకు తనను పరిశీలించినప్పటికీ కొన్ని కారణాల వల్ల నటించలేకపోయానని చెప్పారు. ఇలాంటి అనుభవాలు నటుల ప్రయాణంలో ఆలోచనలకు దారి తీస్తాయని, కానీ ముందుకు సాగడమే అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!