

నందమూరి బాలకృష్ణ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందినప్పటికీ సినిమా నిర్మాణ వేగం మాత్రం తగ్గిపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. గతంలో పరిమిత వనరులతోనే దర్శకులు, నటీనటులు చాలా తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేసేవారని బాలయ్య గుర్తు చేశారు. అప్పట్లో క్రమశిక్షణ, సమయపాలన ముఖ్య పాత్ర పోషించేవని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అత్యాధునిక కెమెరాలు, డిజిటల్ టెక్నాలజీ, భారీ నిర్మాణ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఒక్కో సినిమా పూర్తవ్వడానికి సంవత్సరాలు పడుతున్నాయని బాలయ్య వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు విడుదలైతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆర్థికంగా లాభపడతారని కూడా చెప్పారు. ప్రస్తుతం యువ హీరోలు ఒక్కో ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న తరుణంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిర్మాత బన్నీ వాస్ కూడా ఇటీవల ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఇండస్ట్రీలో పని విధానాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా బాలయ్య మాత్రం వరుస సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ తన ప్రత్యేక వర్కింగ్ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!