
జనరల్

సల్మాన్ ఖాన్ మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న SVC63 సినిమాకు “ది మెసెంజర్” అనే టైటిల్ ఖరారు అయినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పని చిత్రబృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోందని, ఇంకా అధికారిక టైటిల్ ఖరారు కాలేదని తెలిపారు. టైటిల్‌ను సరైన సమయంలో అధికారికంగా ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ఖాన్ కొత్త లుక్, వంశీ పైడిపల్లి దర్శకత్వం, భారీ నిర్మాణ విలువల కారణంగా సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌ను చిత్రబృందం ఖండించింది. అభిమానులు అధికారిక టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!