

సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై విడుదలకు ముందు భిన్నమైన అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ‘కరుప్పు/వీర భద్రుడు’తో సూర్య మంచి కంబ్యాక్ అందుకోవడంతో, క్లాస్ కథతో వస్తున్న ఈ సినిమా ఎలా స్పందన తెచ్చుకుంటుందనే ఆసక్తి నెలకొంది. అయితే అంచనాలను మించి తొలి వారంలోనే సినిమా మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తాజాగా చిత్రబృందం మరో కీలక మైలురాయిని ప్రకటించింది. సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది. దీంతో సూర్య కెరీర్‌లో ఈ ఏడాది ప్రత్యేకమైన రికార్డు నమోదైనట్లు అభిమానులు చెబుతున్నారు.
ఇప్పటికే వచ్చిన ‘కరుప్పు/వీర భద్రుడు’తో కలిపి సూర్య నటించిన సినిమాలు ఈ ఏడాది రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఒకే ఏడాదిలో ఈ స్థాయి వసూళ్లు అందుకున్న అరుదైన ఘనత సూర్య ఖాతాలో చేరింది. తుది వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సూర్య, దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!