
జనరల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన లండన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను వివరించారు. పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎంకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా స్వాగతం పలికాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!