
క్రీడలు

గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో భవన యజమాని సయ్యద్ సాజిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంజయ్యనగర్‌లో అవసరమైన అనుమతులు లేకుండా సాజిద్ ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నాసిరకం నిర్మాణం కారణంగా ఈ నెల 22న భవనం కూలిపోగా, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఖాజా కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!