
జనరల్

ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ నారంగ్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. హైదరాబాద్లో మే 20న జరిగిన సమావేశంలో ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి అధికారికంగా ఆమోదించింది.
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ విడుదల చేసిన ప్రకటనలో, సునీల్ నారంగ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణమే విముక్తి కల్పించినట్లు వెల్లడించింది. ఈ పరిణామం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!