

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. తిరుపతి పరిసరాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ భావోద్వేగ ప్రేమకథ రస్టిక్ బ్యాక్డ్రాప్లో కుటుంబ అనుబంధాలు, ప్రేమ, సంఘర్షణలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. కథలోని భావోద్వేగాలు, సహజమైన పాత్రలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో మోహన్ బాబు శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హీరోతో ఆయన మధ్య సాగే ఘర్షణాత్మక సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కానున్నారు. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!