

మారుతున్న మానవ సంబంధాలు, పెరుగుతున్న విడాకుల కేసులపై సినీ నటి కాజల్ అగర్వాల్ స్పందించారు. మనుషుల మధ్య అనుబంధాలపై సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు ప్రభావం చూపుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఫోన్ల వినియోగం పెరగడంతో దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతున్నాయని చెప్పారు. రెస్టారెంట్లు, డిన్నర్ డేట్‌లకు వెళ్లిన సమయంలోనూ చాలామంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి బదులుగా ఫోన్లలోనే మునిగిపోతున్నారని పేర్కొన్నారు. అర్థవంతమైన సంభాషణలు, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం తగ్గిపోవడం వల్ల బంధాల్లో దూరం పెరుగుతోందని అన్నారు.
తాను, తన భర్త ఖాళీ సమయానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తామని కాజల్ తెలిపారు. ప్రతి వారం క్రమం తప్పకుండా డిన్నర్‌కు వెళ్లి, ఫోన్లను పక్కన పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా వ్యామోహం నుంచి కొంత దూరంగా ఉండి, భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడం అలవాటు చేసుకోవాలని సూచించారు. సినిమాల విషయానికొస్తే.. కాజల్ అగర్వాల్ ఇటీవల ‘ది ఇండియా స్టోరీ’లో కనిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!