

‘గూఢచారి’, ‘మేజర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి శోభిత ధూళిపాళ్ల ఇప్పుడు తొలిసారి తెలుగులో ఓటీటీ సినిమా ద్వారా అలరించేందుకు సిద్ధమైంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో, డి. సురేశ్‌బాబు నిర్మించిన ‘చీకటిలో’ చిత్రం ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. విడుదలకు ముందు ఆమె మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో శోభిత ‘సంధ్య’ అనే పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపించనుంది. సవాళ్లతో నిండిన జీవితంలో అనూహ్య సంఘటనలను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగే యువతిగా ఆమె పాత్ర ఉంటుందని తెలిపారు. పైకి క్రైమ్ థ్రిల్లర్‌లా కనిపించినా, ఈ సినిమా బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ఉత్కంఠభరిత మలుపులు ప్రేక్షకులను చివరివరకు కట్టిపడేస్తాయని వెల్లడించారు. ఈ పాత్ర ఎంతో మంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రేక్షకుల స్పందనను ఊహించి పాత్రలు ఎంచుకోనని శోభిత స్పష్టం చేశారు. తన మనసుకు నచ్చిన కథలనే ఎంచుకుంటానని చెప్పారు. అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పని చేయడం తనకు గొప్ప అనుభవమని పేర్కొన్నారు. ‘చీకటిలో’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని ఆశిస్తున్నానని, త్వరలో తన తమిళ చిత్రం ఒకటి తెలుగులో అనువాదంగా విడుదల కానుందని తెలిపారు.
_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!