

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, అవమానకర పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళం సృష్టిస్తూ ప్రతికూలతను వ్యాప్తి చేస్తున్నాయని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలైన తర్వాత ఎస్‌కేఎన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అనంతరం ఆయన కనిపించలేదంటూ కొందరు విమర్శలు చేయడంతో పాటు టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన ఎస్‌కేఎన్, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!