

ప్రయాణికులకు మరింత ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు తమిళనాడు మెట్రో రైల్ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై మెట్రో రైళ్లలో మొబైల్ స్పీకర్ల ద్వారా పాటలు, వీడియోలు లేదా ఇతర ఆడియోలను పెద్ద శబ్దంతో ప్లే చేస్తే రూ.2,500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మెట్రోలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి అందరికీ ఆహ్లాదకరమైన ప్రయాణ వాతావరణాన్ని కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రతిరోజూ వేలాది మంది మెట్రో సేవలను వినియోగిస్తున్న నేపథ్యంలో, మొబైల్ స్పీకర్ల ద్వారా వినిపించే పెద్ద శబ్దాలు ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే ప్రయాణ సమయంలో పాటలు వినాలన్నా, వీడియోలు చూడాలన్నా తప్పనిసరిగా ఇయర్‌ఫోన్స్ ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధన ప్రయాణికుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడంతో పాటు మెట్రోలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు దోహదపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!