

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నవంబర్ 11 రాత్రి ఓ సినిమా పాట చిత్రీకరణను పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ వెనుక నుంచి ఆయన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దెబ్బతినగా.. శేఖర్ మాస్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
మరోవైపు, శేఖర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన తర్వాత బంధువులు, స్నేహితుల నుంచి తనకు పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తాను శేఖర్ మాస్టర్‌తో మాట్లాడానని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అదే రోజు సాయంత్రం ‘కాకా’ సినిమా షూటింగ్‌లోనూ శేఖర్ మాస్టర్ పాల్గొననున్నట్లు జానీ మాస్టర్ వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!