
సినిమాలు

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ప్రైవేట్ జెట్లో ప్రయాణించిన చిత్రాలను నటి సీరత్ కపూర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ చిత్రాలు అభిమానుల మధ్య వేగంగా వైరల్ అయ్యాయి. పలువురు అభిమానులు వాటిపై వివిధ రకాలుగా స్పందించారు.
అయితే ఓ నెటిజన్ “నువ్వు అల్లు అర్జున్ ఆస్తి” అంటూ చేసిన వ్యాఖ్యపై సీరత్ కపూర్ ఘాటుగా స్పందించారు. మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించిన ఆమె, ఏ మహిళ కూడా ఎవరి ఆస్తి కాదని స్పష్టం చేశారు. ప్రతి మహిళకు తనదైన గుర్తింపు, కలలు, వ్యక్తిత్వం ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!