

యంగ్ హీరో సత్యదేవ్ కంచరాన తన 16వ చిత్రమైన సమవర్తి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అజయ్ నాగ్ వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “ఎకాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్” జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్యదేవ్ హెడ్‌ఫోన్స్‌తో ప్రశాంతంగా కనిపిస్తుండగా చుట్టూ ఆయుధాలతో ఉన్న వ్యక్తులు కనిపించడం ఆసక్తిని పెంచింది.
ప్రకృతి, అడవి నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్‌తో ఈ కథ సాగనుందని చిత్రబృందం తెలిపింది. పోస్టర్‌లో కనిపించిన టైగర్, నేచర్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గణవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇదే అత్యంత పవర్‌ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!