

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్ సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో జరిగిన ప్రమాదంలో పదేళ్ల బాలుడు అభిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో మరో విద్యార్థి యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పిక్నిక్‌లో భాగంగా పిల్లలు పార్క్‌లోని భారీ ఇనుప ఊయలపై ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం, ఊయలపై సుమారు పది మంది విద్యార్థులు ఉండగా, మరో నలుగురు వెనుక నుంచి వేగంగా ఊపారు. దీంతో ఊయల అదుపుతప్పి వెనక్కి బలంగా రావడంతో విద్యార్థులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిరామ్ తీవ్రంగా గాయపడి మృతి చెందగా, యశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంతో పిక్నిక్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గాయపడిన యశ్వంత్‌కు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. స్కూల్ పిక్నిక్‌లో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పార్కుల్లో పిల్లలు ఆడుకునే పరికరాల భద్రత, పర్యవేక్షణపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!