

యువ నటుడు సంగీత్ శోభన్ హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం ప్రకటించారు. నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రణయ్ రావు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రణయ్ రావుకు ఇది దర్శకుడిగా తొలి చిత్రం కాగా, గతంలో ఆయన ‘సాహో’కు అసోసియేట్ డైరెక్టర్‌గా, ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు అదనపు స్క్రీన్‌ప్లే పనుల్లో భాగమయ్యారు. సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న 15వ చిత్రం, సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రంగా ఇది నిలవనుంది.

మిస్టరీ థ్రిల్లర్‌తో పాటు కామెడీ అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రణయ్ రావు సంగీత్ శోభన్ బాడీ లాంగ్వేజ్, నటనా శైలికి అనుగుణంగా కథను రూపొందించినట్లు వెల్లడించారు. సస్పెన్స్, ఊహించని మలుపులు, ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!