
క్రీడలు

జింబాబ్వే సీనియర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. షార్జా వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో మళ్లీ శతకం నమోదు చేశాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లో ఏడో సెంచరీ కావడం విశేషం.

40 ఏళ్ల 272 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన టేలర్.. జింబాబ్వే తరఫున టెస్టుల్లో సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా 2000 సంవత్సరం తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేసిన రెండో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. అతడి ఈ ప్రదర్శన జింబాబ్వే క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!