

ప్రసిద్ధ నటి సమంత తాజాగా తన మార్నింగ్ రొటీన్‌ను అభిమానులతో పంచుకున్నారు. దీనిని ఆమె “పవర్ మార్నింగ్” అని పేర్కొన్నారు. ఉదయం శాంతిగా ప్రారంభించడమే మిగిలిన రోజు ఉత్సాహంగా, ఉత్పాదకంగా గడిచేలా చేస్తుందని సమంత తెలిపారు. నిద్ర లేచిన వెంటనే ఫోన్లు చూసుకోవడం, వర్క్ గురించి ఆలోచించడం వల్ల ఉదయాన్నే ఒత్తిడికి గురవుతారని ఆమె పేర్కొన్నారు. తన జీవితాన్ని మార్చిన సులభమైన ఫార్ములాను అవలంబించటం వల్ల జీవితంలో సానుకూల మార్పు వచ్చింది.
సమంత రొటీన్‌లో నిద్ర లేచిన తర్వాత ఒక గంట పాటు ఫోన్ వాడకపోవడం, ఐదు నిమిషాలు ధ్యానం, సూర్యరశ్మి తీసుకునేలా కూర్చోవడం, గోరువెచ్చటి నీటిలో పసుపు, నిమ్మరసం కలిపి తాగడం, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్, 11 గంటలలోపు వర్కౌట్స్, రోజుకు సాధించాలనుకున్న అంశాలను పుస్తకంలో రాయడం ఉన్నాయి. జీవితంలో నిజమైన మార్పు కోరుకునేవారు 21 రోజుల పాటు దీన్ని ఫాలో కావాలని ఆమె సూచించారు.













.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!