
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ త్వరలోనే ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే సల్మాన్ ఖాన్‌తో కలిసి ఒక హై కాన్సెప్ట్ సూపర్ హీరో కామెడీ చిత్రాన్ని తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కథను సల్మాన్ ఖాన్‌కు వినిపించగా, ఆయనకు కథ నచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో కాకుండా, నియంత్రిత వ్యయంతో రూపొందించాలని సల్మాన్ దర్శకులకు సూచించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లేను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. యాక్షన్ జీవితానికి దూరంగా వెళ్లాలని భావించే ఒక సూపర్ హీరోను పరిస్థితులు మళ్లీ యాక్షన్‌లోకి తీసుకెళ్లే కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!