
రాజకీయాలు

ఇటీవలి కాలంలో సినిమాల ఫలితాలపై రివ్యూవర్ల ప్రభావం గురించి జరుగుతున్న చర్చల మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివ్యూవర్లు సినిమా పరిశ్రమ కోసం కాకుండా ప్రేక్షకుల కోసం పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులు తమ కష్టార్జిత ధనం, విలువైన సమయాన్ని వెచ్చించే ముందు సరైన సమాచారం అందించడం వారి బాధ్యత అని పేర్కొన్నారు.
ఒక సినిమా నాణ్యతలేనిదిగా ఉంటే దాని గురించి ప్రేక్షకులను హెచ్చరించడం ప్రజాసేవతో సమానమని వర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో రివ్యూవర్లు సామాన్య ప్రేక్షకులకు రక్షణ కవచంలా మారారని అన్నారు. సినిమాలు ఫ్లాప్ అయితే రివ్యూవర్లను నిందించడం కంటే, మంచి కంటెంట్ అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!