

ప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన తదుపరి సినిమాలో ప్రధాన హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి ‘షోమ్యాన్’ అనే పేరు ఖరారైనట్లు ప్రకటించారు. మ్యాడ్ మాన్స్టర్ అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది. సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండడం విశేషం. రజినీకాంత్ శివాజీ చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకున్నదో అందరికీ తెలిసిందే.
ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నూతన్ తెరకెక్కిస్తున్నారు. దీనితో ఆయన సినీ పరిశ్రమలోకి ప్రవేశం జరుగుతోంది. ఆర్జీవీతో ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2 వంటి చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న షో మ్యాన్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వచ్చే సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా దర్శకుడు నూతన్ అందిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!