
ఓటీటీ

యంగ్ హీరో విక్రాంత్ తన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’లో చేసిన నటనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ – జ్యూరీ స్పెషల్ అవార్డ్’ అందుకున్నారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి గౌరవం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనకు మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలనే ప్రేరణను ఇచ్చిందని విక్రాంత్ తెలిపారు.
‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించగా, సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ ఆదరణ పొందింది. ప్రస్తుతం విక్రాంత్ దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్లో ‘మార్కండేయ’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!