
గాసిప్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ ఏడాది హీరోయిన్గా పలు పాన్ ఇండియా స్థాయి చిత్రాలతో బిజీగా ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో కేవలం కొద్ది వారాల గ్యాప్‌లోనే ఆమె నటించిన ‘థామా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.
ఇప్పుడు రెండు చిత్రాలూ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాయి. అయితే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్‌లోనే నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.
ఈ అద్భుత ఆదరణకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆనందం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమవుతున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. హేషం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించగా, విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!