

రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రాన్ని ఎంచుకున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారో చూపించేలా ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో రష్మిక గిరిజన మహిళ ‘మైసా’గా కనిపించనున్నారు. సమాజంలోని సవాళ్లు, అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా ఆమె పాత్రను తీర్చిదిద్దారు. ఒకసారి పోరాటానికి సిద్ధమైతే వెనక్కి తగ్గని మైసా పాత్రలో రష్మిక తీవ్రత ఆకట్టుకుంటోంది.
పాత్ర కోసం రష్మిక శారీరకంగా ఎంతో శ్రమించినట్లు టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు స్పష్టం చేస్తున్నాయి. బైక్‌పై దూసుకెళ్లడంతో పాటు, క్లిష్టమైన నీటి అడుగున సన్నివేశాల్లోనూ ఆమె కనిపించారు. శ్రేయాస్ పి. కృష్ణ అందించిన విజువల్స్, జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరింత గాఢమైన వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!