

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక ‘జయమ్మ’గా అలరించనుంది. ఇటీవల విడుదలైన ‘ఏందయ్యా సామీ..’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో పాటలోని ఓ రొమాంటిక్ క్లిప్‌పై రష్మిక చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విజయ్ తనకు పూర్తిగా సొంతమైనప్పటికీ.. అతనిపై ఉన్న క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆమె పేర్కొంది.
రష్మిక వ్యాఖ్యకు విజయ్ దేవరకొండ కూడా ప్రేమగా స్పందించారు. “నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను జయమ్మను మిస్ అవుతాను కానీ.. జీవితాంతం నువ్వు నా దగ్గరే ఉంటావు” అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!