
సినిమాలు

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతూ ముగింపు దశకు చేరుకుంది. చిత్రబృందం వెల్లడించిన సమాచారం ప్రకారం ఇప్పటికే 102 రోజుల షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. ఇంకా దాదాపు 20 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండటంతో సినిమా నిర్మాణ పనులు తుది దశలోకి ప్రవేశించాయి.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో భారీ చిత్రంగా నిలవనున్న ‘రణబాలి’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!