

భారీ అంచనాల మధ్య విడుదలైన క్రేజీ చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. భారతీయ సినిమాను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేయాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలిరోజు నుంచే సంచలన ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. తాజా ట్రేడ్ సమాచారం ప్రకారం, వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
బుక్‌మైషో బుకింగ్స్‌లోనూ రణబీర్ కపూర్ సినిమా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పండుగ, వీకెండ్, సెలవుల సమయంలోనే కాకుండా పని దినాల్లోనూ భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. గత 24 గంటల్లోనే 1.25 మిలియన్లకు పైగా టికెట్లు విక్రయమైనట్లు సమాచారం. విడుదలైన రోజు నుంచి ప్రతిరోజూ 1 మిలియన్‌కు పైగా టికెట్ల అమ్మకాలు నమోదవడం విశేషం. ఈ స్థాయి జోరు మరికొన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!