

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో పట్టుబడిన ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ముంబైకి తరలించారు. రాజస్థాన్‌లోని కోటాలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కాల్పుల ఘటన అనంతరం నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ముంబై నుంచి ట్యాక్సీలో సూరత్‌కు చేరుకున్న వారు, తెల్లవారుజామున 1.31 గంటలకు అక్కడి రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం కదులుతున్న రైలులోని జనరల్ బోగీలోకి ఎక్కి ప్రయాణించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఢిల్లీ మీదుగా నేపాల్‌కు పారిపోయేందుకు నిందితులు ప్రణాళిక వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. నిందితుల ప్రయాణ మార్గం, కాల్పుల వెనుక ఉద్దేశం, ఈ ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!