

కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. యానాం నుంచి కాకినాడ వరకు సముద్ర తీర ప్రాంతాలకు ఉప్పెన హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో అలలు 2.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉప్పాడ తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా ఉప్పాడ బీచ్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు.
అర్నబ్ తుఫాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, బాపట్లకు 300 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. రేపు యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!