

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం బరి కోసం సిద్ధమవుతున్నారు. కొంతకాలం క్రితం గాయపడిన ఆయనకు శస్త్రచికిత్స పూర్తవడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారు. విశ్రాంతి అనంతరం తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో గుర్తింపు పొందిన యదు వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో వాలీబాల్ క్రీడ చుట్టూ సాగే క్రీడా కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాత్రకు తగ్గట్టుగా వరుణ్ తేజ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. చిత్రీకరణ ప్రారంభం కాకముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థపై ఉన్న నమ్మకమే ఈ ఒప్పందానికి కారణమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అనూప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టి, 2027 రెండో అర్ధభాగంలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!