

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. తొలి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజాగా విడుదలైన జైలర్ 2లో హృతిక్ రోషన్ కూడా అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో తదుపరి భాగంలో ఎవరెవరు కనిపించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
జైలర్ 2లోని ఓ కీలక అతిథి పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను నెల్సన్ సంప్రదించినట్లు సమాచారం. అయితే పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో బాలయ్య ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ జైలర్ 3లో ఆయన నటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. మూడో భాగంలో తన స్థాయికి సరిపోయే పాత్రలో కనిపించేందుకు బాలకృష్ణ అంగీకరించినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. రజనీకాంత్‌తో బాలయ్య కలిసి నటిస్తే అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!