

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు సహా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ముంబయిలో గ్రాండ్గా ట్రైలర్ను విడుదల చేశారు.
ట్రైలర్లో రామ్ చరణ్ చెప్పిన “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు” అనే డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్, రామ్ చరణ్ మాస్ అవతార్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. బుచ్చిబాబు సనా టేకింగ్, రామ్ చరణ్ నటన చూస్తుంటే థియేటర్లలో ‘పెద్ది’ భారీ సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!