
జనరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ క్రీడా నేపథ్య చిత్రం జూన్ 4న విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
‘పెద్ది’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ చిత్ర బృందంతో కలిసి ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో సినిమా వీక్షించారు. పాప్‌కార్న్ తింటూ పెద్ద తెరపై తన నటనను ఆస్వాదించిన రామ్ చరణ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. థియేటర్లోని ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!