

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాకా. గ్లోబల్ స్థాయి కథాంశంతో పాటు గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఆయన పేరును మేకర్స్ ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అట్లీ గతంలో అనిరుధ్‌తో కలిసి పనిచేసిన నేపథ్యంలో రాకాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని చాలామంది భావించారు.
అయితే సాయి అభ్యంకర్ ఎంపిక వెనుక ఆసక్తికరమైన విషయాన్ని అట్లీ వెల్లడించినట్లు సమాచారం. సాయిని ఎంపిక చేయడానికి ముందు జీవీ ప్రకాశ్ కుమార్ లేదా అనిరుధ్‌తో రాకా సినిమాకు పనిచేయాలని తాను భావించినట్లు తెలిపారు. తన సినిమాలకు కొన్ని ప్రాజెక్టుల తర్వాత సంగీత దర్శకుడిని మార్చడం సాధారణమేనని అట్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నిర్మాత మారన్‌తో చర్చలు జరిపినప్పుడు ఆయన సాయి అభ్యంకర్ పేరును సూచించారట. ఆ సూచనతోనే సాయి ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో రాకా సినిమాలో సాయి సంగీతం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!