

రేపు విడుదలకానున్న సినిమాల్లో ముందుగా పెద్దగా అటెన్షన్ లేకపోయినా, ఒక్క లీక్‌తో సోషల్ మీడియాలో దృష్టిని తనవైపుకు తిప్పుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రంపై టీమ్ మొదట పెద్దగా నమ్మకం చూపించకపోయినా, ‘లిటిల్ హార్ట్స్’తో తొలి థియేట్రికల్ రిలీజ్‌ను బ్లాక్‌బస్టర్‌గా మార్చుకున్న ETV Win ఇప్పుడు ఈ సినిమాపై కూడా మంచి నమ్మకంతో ఉంది.
బయట చక్కర్లు కొడుతున్న క్లైమాక్స్ ట్విస్ట్ నిజమో కాదో తెలియకుండానే జనాలు బాగా చర్చించుకుంటున్నారు. నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో గెస్ట్‌గా వచ్చిన కిరణ్ అబ్బవరం, “ఇలాంటి షాకింగ్ ముగింపు జీవితంలో చూడలేదు” అన్నట్లు వ్యాఖ్యానించడంతో అంచనాలు మరింత పెరిగాయి.
అసలు ఆ క్లైమాక్స్ ఏంటో రేపటికి తెలిసిపోతుంది.
అయితే టికెట్ రేట్ల విషయంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరికీ నచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో:
సింగిల్ స్క్రీన్ టికెట్ → ₹99
మల్టీప్లెక్స్ టికెట్ → ₹105
“ప్రతిసారి ధరల గురించి చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి అందరికీ అందుబాటులో ఉండే రేట్లు పెట్టాం. థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి” అని నిర్మాతలు తెలిపారు. అయితే ఆన్లైన్ బుకింగ్స్‌లో ఇంకా ఈ రేట్లు పూర్తిగా అప్డేట్ కాలేదు. కొన్ని మల్టీప్లెక్సులు ₹150 చూపిస్తుండగా, ఏపీలో కూడా మార్పులు ఇంకా ప్రతిబింబించలేదు.
ఇలాంటి నిర్ణయం ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం. వందల కోట్ల బడ్జెట్ సినిమాలు రేట్లు పెంచుకోవడం ఒక విషయం అయితే, రెండు–మూడు కోట్లలో తీసిన సినిమాలు రేట్లు తగ్గించడం పూర్తిగా లాజిక్‌గానే ఉంది.
ఇలా చేస్తే ఫుట్‌ఫాల్స్ పెరిగే అవకాశం ఎక్కువ. పాజిటివ్ టాక్ వస్తే రెండు–మూడు వారాలు మంచి రన్ దక్కుతుంది.
ముందున్న పోటీ:
వచ్చే వారం రామ్ నటిస్తున్న ఆంధ్రకింగ్, డిసెంబర్ 5న అఖండ 2 విడుదల కానున్నాయి. అందువల్ల ఫస్ట్ వీక్‌లోనే మంచి కలెక్షన్లు రాబట్టడం ఈ తరహా సినిమాలకు కీలకం.
సినిమా నిజంగా బాగుంటే పోటీ ఎంత ఉన్నా జనాలు లెక్క చేయరు. అందరూ చెబుతున్న క్లైమాక్స్ నిజంగా కనెక్ట్ అయితే, ‘రాజు వెడ్స్ రాంబాయి’ హిట్ కొట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!