

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న రాజాసాబ్ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్దమవుతోంది. సిజి పనులు ఎక్కువగా ఉండటంతో సినిమా ఆలస్యమవుతుందేమో అనిపించినా, యూనిట్ వర్గాలు మాత్రం “సంక్రాంతికే ఖాయం” అని చెబుతున్నాయి.
ఈ చిత్రంలో 6 వేలకుపైగా సిజి షాట్లు ఉన్నాయని సమాచారం. అంత భారీ స్థాయిలో ఉన్నా, పనిలో ఎలాంటి జాప్యం లేకుండా పలు సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. ఒక విదేశీ కంపెనీతో పాటు, పీపుల్స్ మీడియా స్వంత సంస్థ, మరో భాగస్వామ్య సంస్థ కూడా ఈ సిజి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అవసరమైతే మరికొన్ని కంపెనీలను కూడా చేరుస్తారని నిర్మాత విశ్వ ప్రసాద్ తెలిపారు.
ప్రస్తుతం రోజుకు మూడు వందల సిజి షాట్లు డెలివరీ అవుతున్నాయి. వచ్చిన వాటిని డైరెక్టర్ మారుతి, ఆయన టీమ్ రోజూ క్వాలిటీ చెక్ చేస్తూ, ఎడిటింగ్ పనులు చూస్తున్నారు.
ఏ పరిస్థితుల్లోనూ సంక్రాంతి రిలీజ్ మిస్ కావొద్దని యూనిట్ సంకల్పం. అవసరమైతే డే అండ్ నైట్ వర్క్ చేసి అయినా పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇక సినిమా ఓటిటి డీల్ కూడా దాదాపుగా క్లోజ్ అయ్యే దశలో ఉంది. చిన్న ఫైనాన్షియల్ అగ్రిమెంట్ పూర్తయిన వెంటనే ఓటిటి ఒప్పందం అధికారికంగా సైన్ అవుతుందని సమాచారం.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (1)
Excited for this!