
సినిమాలు

దర్శకుడు ప్రణవ్ స్వరూప్ రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ ట్రైలర్‌ను సాగర్ కే చంద్ర విడుదల చేశారు. ప్రేమ, మానసిక సంఘర్షణ, కుటుంబ హింస నేపథ్యంలో సాగే కథను తీవ్ర ఉత్కంఠతో చూపించారు.
నందు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆకట్టుకోగా, అతని నటన ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. అవికా గోర్ సాధారణ గృహిణిగా భావోద్వేగభరిత నటనతో మెప్పించింది. డార్క్ విజువల్స్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా మే 22న థియేటర్లలో విడుదల కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!