
న్యూస్

ప్రస్తుత సినీ పరిశ్రమలో నిర్మాతలకు గతంతో పోలిస్తే విలువ తగ్గిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని, అయితే ఇప్పుడు తీసుకునేవారే ఇచ్చిన వారిని శాసించే స్థాయికి పరిశ్రమ మారిందని వ్యాఖ్యానించారు. సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 90వ జన్మదినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పూర్ణచంద్రరావు నిర్మించిన 87 చిత్రాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు.
అట్లూరి సమర్పణలో తాను ఒక విలువలతో కూడిన సినిమా నిర్మిస్తానని ప్రకటించిన దిల్ రాజు, తన తొలి సినిమా ‘దిల్’ హిందీ రీమేక్ హక్కులను అట్లూరి అడిగిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!