

మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందన్న వార్తలపై ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి స్పందించారు. ఈ విషయంలో ప్రశ్నించగా, సుస్మిత ప్రస్తుతం ఎలాంటి కామెంట్ చేయబోనని చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నిర్మాతలు, బుధవారం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ఇతర ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ హాజరవుతారని తెలిపారు.
చిరంజీవి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని, విదేశాల్లో ఉన్న అభిమానులతో వీడియో కాల్స్ ద్వారా కూడా మాట్లాడుతున్నారని సుస్మిత వివరించారు. ఆయన ఫిట్నెస్ గతంతో పోలిస్తే మరింత మెరుగైందని, అందుకే ఈ సినిమాలో ప్రత్యేక లుక్‌లో కనిపిస్తున్నారని చెప్పారు. షూటింగ్ సమయంలో పూర్తిగా పాత్రలో లీనమై ఉంటారని, ఈ సినిమాలో చిరంజీవిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందని తెలిపారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, చిరంజీవి ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారని, అవుట్డోర్ షూటింగ్ ఉన్నా రోజుకు రెండు సార్లు జిమ్ చేసేవారని చెప్పారు. ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన లేదని కూడా స్పష్టం చేశారు.
ఇటీవల చిరంజీవికి చిన్న సర్జరీ జరిగిందన్న వార్తలు, మోకాలి సమస్య ఉందన్న కథనాలు రావడంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొంటారని నిర్మాతలు చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. చిరంజీవి వింటేజ్ లుక్, గ్రేస్, కామెడీ టైమింగ్ బాగున్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!