

ప్రతిభావంతుడైన నటుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్, యువ నిర్మాత బన్నీ వాస్ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, తెలంగాణ ఫోక్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం సుకుమార్‌ను కలిసి ఆశీస్సులు తీసుకోగా, ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.
యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలంగాణ కుటుంబ నేపథ్యంతో వినోదాత్మక డ్రామాగా రూపొందనుంది. ఈ సందర్భంగా నాగదుర్గ పుట్టినరోజు వేడుకలను కూడా చిత్ర బృందం జరిపింది. కంటెంట్ ఆధారిత చిత్రాలకు పేరుగాంచిన ప్రియదర్శి హీరోగా నటించడం, ఫోక్ సాంగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన నాగదుర్గ హీరోయిన్‌గా అరంగేట్రం చేయడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. జూన్ 25న చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ చేపట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!