

ప్రేమ మధురం (ఇద్దరూ ఒకటయ్యారు) చిత్ర టైటిల్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జే.ఎల్ 14 రీల్ సినిమా ప్రొడక్షన్ మరియు ఎన్ జి ఆర్ సినిమా ప్రొడక్షన్ బ్యానర్లపై ఎస్కే జలీల్, స్వామి దాసు నాగరత్నం నిర్మాతలుగా, పరకోటి బాలాజీ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నిర్మాత డాక్టర్ ఎస్.కె. జలీల్ ఈ చిత్రానికి పాటలు కూడా రాయడం విశేషం. హీరోగా చంటి నటిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ ప్లేయర్ సంధ్య, సుష్మ, దాక్షాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. జబర్దస్త్ గడ్డం నవీన్, పంచ్ ప్రసాద్, వింజమూరి మధు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కార్యక్రమంలో తెలుగు ఫిలిం చాంబర్ కోశాధికారి ముత్యాల రామదాసు చిన్న సినిమాల నిర్మాణంలో ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ సెక్రెటరీ మోహన్ వడ్లపట్ల కూడా చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. దర్శకుడు పరకోటి బాలాజీ ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో చూడదగిన కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా అభివర్ణించారు. నటీనటులు, సాంకేతిక బృందం అందరూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!