

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. మే 23న భోపాల్‌లో జరగనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్ కోసం కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ వేడుక కోసం ముంబై నుంచి అత్యాధునిక మ్యూజిక్ ఎక్విప్మెంట్ను ప్రత్యేకంగా తెప్పిస్తున్నారట. సౌండ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా దేశంలోనే అత్యుత్తమ సిస్టమ్స్‌ను ఉపయోగించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన ప్రత్యేక పాటను విడుదల చేసే అవకాశం కూడా ఉందని సమాచారం. భారీ స్థాయిలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న పెద్ది కోసం మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!