

పెద్ది సినిమాకు విడుదలకు ముందే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయనే చర్చ టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న పర్సెంటేజ్ రెవెన్యూ వివాదం తెలంగాణలో సినిమా ప్రదర్శనపై అనిశ్చితిని సృష్టిస్తున్నట్లు సమాచారం. ఈ అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు సినిమాలకు నైజాం మార్కెట్ అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ‘పెద్ది’ విడుదలకు ఆటంకాలు ఎదురైతే బాక్సాఫీస్‌పై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లు ప్రేక్షకుల కొరత, పెరిగిన నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ వివాదం మరింత ఉద్రిక్తతను పెంచింది. సోషల్ మీడియాలో అభిమానులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతుండగా, పెద్ద సినిమాలను వివాదాల్లోకి లాగడం పరిశ్రమ భవిష్యత్తుకు మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!