

సీనియర్ ఎం ఎల్ ఏ గా, టాప్ హీరో గా విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 56 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) లో ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశం నలుమూలల నుంచి అటెండ్ అయిన వివిధ భాషల సినీ ప్రముఖులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక వేడుక గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఇటీవల 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంకు చీఫ్ గెస్ట్ గా గోవా గవర్నర్ పి. అశోక్ గజపతి రాజు, గోవా సీఎం ప్రమోద్ సావంత్ , రాష్ట్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి ఎల్. మురుగన్ లు హాజరై బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన ఐదు దశాబ్దాల ప్రయాణంలో తోడుగా నిలిచిన అభిమానులుకు, దర్శకులకు , నిర్మాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం అందించిన స్ఫూర్తిని స్మరించుకుంటూ, వారి వారసత్వాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా తన విజయం లో కీలకంగా ఉంటూ సపోర్ట్ చేస్తున్న భార్య వసుంధర కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చిత్రరంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య నటించిన అఖండ 2 విడుదలకు సిద్ధంగా ఉండగా, త్వరలో గోపీచంద్ మలినేనితో ఓ పౌరాణిక యాక్షన్ డ్రామాలో నటించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!