

తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటీమణి నిధి అగర్వాల్ తన కెరీర్‌కు కీలక మలుపు అవుతుందని ది రాజాసాబ్ భారీ ఆశలు పెట్టుకుంది. హరి హర వీరమల్లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్‌తో కలిసి నటించిన ఈ చిత్రం తనను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో నిలబెడుతుందని భావించింది. అయితే దాదాపు నాలుగేళ్ల పాటు నిరీక్షించి, పూర్తి సమయాన్ని కేటాయించినప్పటికీ ఈ సినిమా ఫలితం ఆమె ఆశలను నిరాశగా మార్చింది.
అక్కినేని బ్యానర్లో సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన నిధి,ఇస్మార్ట్ శంకర్ తో భారీ గుర్తింపు పొందింది. అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని సినీ వర్గాలు భావించాయి. హీరో చిత్రంతో కొంత గుర్తింపు వచ్చినా, ఆశించిన స్థాయి అవకాశాలు మాత్రం రాలేదు. హరి హర వీరమల్లు, ది రాజాసాబ్ పై ఎక్కువగా ఆధారపడిన నిధి, కొత్త ప్రాజెక్టులు చేయకుండా ఎదురుచూసినా, ఫలితాలు మాత్రం ఆమె కెరీర్‌కు ఊహించిన మలుపు ఇవ్వలేకపోయాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!